Jan 01,2023 16:54

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : సూళ్లూరుపేట సిపిఎం/సిఐటియు నాయకులు ఆదివారం ఆఫీసులో సమావేశమయ్యారు. ప్రజలు కార్మికులు హక్కుల కోసము సంఘటితంగా పోరాడాలన్నారు. జగనన్న ప్రభుత్వము అప్పులు వూబిలో కూరుక పోయిందని తిరుపతి జిల్లా భవన నిర్మాణ కార్మిక అధ్యక్షులు అల్లెయ్య విమర్శించారు. జగనన్న హౌసింగ్ స్కీమ్ నత్తి నడకన నడుస్తుందని, ప్రకటించిన లక్షల ఇళ్ళు నిర్మాణములో ఇంతవరకు 5% ఇళ్ళు కూడా పూర్తి కాలేదన్నారు. నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇసుక, ఇటుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అలాంటప్పుడు ప్రభుత్వము కేటాయించిన రూ.1.80 లక్షలు ఏ మూలకు చాలదని, ఇళ్ళు పూర్తి కావాలంటే కనీసము రూ.5 లక్షల నుండి 6 లక్షలు మంజూరు చేయాలని డిమాండు చేసారు. నాయకులు పద్మనాభయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వ్రృధ్ధాప్య పింఛన్లు ఏకంగా 3 వేలు ఇస్తానని హామి ఇచ్చి, రూ.2 వేలతో ప్రారంభించి, జనవరి 2023కు రూ.2750/- మంజూరు చేసారు. అదే క్రమములో ఆడిట్ పేరుతో ఇంత వరకు పెన్షను పొందుతున్న కొన్ని లక్షల మందికి వుధ్వాసన పలకడం దుర్మార్గం అన్నారు. ఈ తొలగింపును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంత వరకు పెన్షను పొందుతున్న వారికి పెన్షను కొనసాగించాలని డిమాండు చేసారు. లేని పరిస్థితుల్లో బాధితులు తరుపున నిలబడి పోరాడుతామన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.