Oct 28,2022 16:25

ప్రజాశక్తి-అల్లూరి : ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు గజ్జి నివారణకు మెడికల్ క్యాంపు నిర్వహించాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గసభ్యుడు పి అప్పల నర్ష ప్రభుత్వానికి డిమాండ్ చేసారు. అనంతరం అయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల వసతి గృహల్లో విద్యార్థులు గజ్జితో ఇబ్బంది పడుతున్నారని, వారికీ మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్యాసేవలు అందించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మండలంలో రూడకోట చుట్టూ ప్రక్కల గ్రామాల్లో గిరిజనసంఘం రాష్ట నాయకులు బోండా సన్నిబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృద్విరాజ్, ఉపాధ్యక్షుడు నర్సయ్య పప్పుల, బుజ్జిబాబుతో కూడిన ప్రతినిధి బృందం రూడకోట ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో సందర్శించగా పాఠశాలలో సుమారు 160 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా 65 మంది గిరిజన విద్యార్థులు గజ్జి తామర  మొదలగు చర్మ వ్యాధులు సోకి అనారోగ్యంతో బాధపడుతున్నారని తమ పర్యటనలో వెలుగులోకి వచ్చిందన్నారు. చర్మవ్యాధి లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సక్రమంగా వైద్యాసేవలు అందిస్తున్నప్పటికి మెరుగైన సేవలు కొరవాడటంతో ఫజ్జి తామర అధికామయ్యాయని అన్నారు. చలికాలం రావడంతో చర్మ వ్యాది లక్షణాలతో మరింత ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. గతంలో వసతి గృహం విద్యార్థులకు కాస్మోటిక్స్ నేరుగా అందించేవారని నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలు చేయడంతో జాస్మోటిక్స్ విద్యార్థులకు అందకా  రోగాల బారిన పడుతున్నరన్నారు. ప్రభుత్వం స్పందించి గిరిజన ఆశ్రమ వసతి గృహల్లో చర్మ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృద్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.