Jul 26,2023 16:21

ప్రజాశక్తి-పెదబయలు : బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించడానికి రాష్ట్ర వైస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెద్దలసభలో మాట్లాడటం వెనక ఆదివాసుల హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం కాలరాయడమేనని  సీతాగుంట  సర్పంచ్  పలసి  మాధవరావు బుధవారం విలేఖరులతో అన్నారు. ఆదివాసీ గిరిజనులకు గుండెకాయ జిఓ నంబర్ 3 ఇప్పటికే రద్దు చేసి గిరిజసిన నిరుద్యోగులతో భర్తీలు చేయాల్సిన ఉపాధ్యాయ ఉద్యోగపోస్టులు గిరిజనేతరులచే భర్తీలు చేస్తూ గిరిజన యువత పొట్టకోట్టారని గిరిజన చట్టాలు రిజర్వేషన్ యదాపలంగా అమలు చేయాలన్నారు. ఆదివాసుల మనుగడ ఉదయం నుండి సాయంత్రం వరకు అటవీని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని, కేంద్రప్రభుత్వం కానుసైగతో సుప్రీం కోర్టు ద్వారా అటవీ హక్కుల చట్టాన్ని జిఓ నంబర్ 3 రద్దు చేపించందని ఆదివాసీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. విజయసాయిరెడ్డి మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యనికి పూర్వం నుండి ఆదివాసులతో మమేకమై జీవనం కొనసాగిస్తున్న కొండా కుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో పలుమార్లు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన్సులు ర్యాలీల రూపంలో పాలక ప్రభుత్వాలకు  వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని  ప్రభుత్వ యంత్రాంగనికి గాని పాలకులకు గాని చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఒకవైపు గిరిజన తెగలకు అన్యాయం జరగదని చెబుతూనే ఇప్పుడు చేస్తున్న దేమిటని ప్రశ్నించారు. ఓట్ల రాజకీయం విడనాడాలని గిరిజన సంక్షేమమే ద్యేయంగా పనిచెయ్యాలని అన్నారు. పాలక ప్రభుత్వాలు మోసపూరిత చర్యలకు  పాల్పడుతుందని  ప్రజలు గమనించలన్నారు. ఈకార్యక్రమంలో వైస్ సర్పంచ్ బోండా గంగాధరం  తదితరులు పాల్గొన్నారు.