Mar 17,2023 16:33

ప్రజశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : మండలం వంచంగి గ్రామానికి చెందిన కోసూరి లోవకుమారి శుక్రవారం 108 వాహనంలో ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోవ కుమారికి శుక్రవారం 4వ కాన్పు అధిక పురిటి నొప్పులతో బాధపడతుండగా కుటింబీకులు 108కి సమాచారం ఇచ్చారు. కాగా 108 వాహనం ఆ గ్రామానికి చేరుకొని పురిటి నొప్పులతో ఉన్న గర్భిణీని ఏలేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో గొంటు వానీపాలెం గ్రామ శివారుకు వెళ్ళేసరికి పురిటి నొప్పులు మరింత ఎక్కువ కావడంతో 108  డ్రైవర్ బాపూజీ అంబులెన్స్‌ని రోడ్డు పక్కన నిలిపి వెయ్యగా 108 సిబ్బంది చింతపల్లి అర్జున్, ఆశ వర్కర్ కుమారిలు ప్రసవం  చేశారు,లోవకుమారి  పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. లోవకుమారి ఇప్పటికే రక్త హీనతతో బాదపడుతుందని ఆశ వర్కర్ కుమారి తెలిపారు, డెలివరీ అనంతరం  ఏలేశ్వరం ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించగా తల్లి  బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు,ఈ సందర్భంగా  108 సిబ్బందిని,ఆశ వర్కర్ ను లోవకుమారి  కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.