Oct 14,2023 08:04

ఎర్ర తివాచీని
ఇక్కడ ఎవరు ఆరేశారు?
తెగిపడ్డ మాంసపు ముద్దలను
ఇక్కడ ఎవరు విసిరేశారు?
తారతమ్యం లేకుండా
ఆడవాళ్ళపై అత్యాచారం చేసి
గొంతు పిసికేసిన మానవ మృగాల
నపుంసకుల జాడ ఎక్కడీ
వేలాది శవాల గుట్టలతో
పేరుకుపోయిన నేల మాగాణి దృశ్యం
తాండవం చేస్తున్నది అక్కడ..
రాకెట్ల దాడులతో
బీభత్స సంఘటనలు
వాటి మధ్య భీతిల్లుతున్న
ప్రజానీకం అక్కడ..
బిక్కుబిక్కుమంటూ
ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని
బంకర్లలో తలదాచుకున్న
అభ్యాగ్యులు ఉండేది అక్కడ!
జాత్యహంకారంతో దాడులు
విధ్వంసంతో విభేదాలు
చేస్తున్నారు వికృత చేష్టలు!
ఎగదోస్తున్న అగ్రరాజ్యాలు
రావణకాష్టంగా ఇరుదేశాలు..
మంచితనంతో సయోధ్య నెరపండి
యుద్ధం సమస్యకు
పరిష్కారం కాదని తెలపండి.
 

- గాదిరాజు రంగరాజు
సెల్‌ : 8790122275