డ్యూరో ప్లై భాగస్వాములకు సత్కారం
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: భారతదేశ ప్రీమియం, అత్యంత అనుభవం కలిగిన ప్లైవుడ్ తయారీ సంస్థ, ప్రముఖ సంస్థలలో ఒకటైన డ్యూరోప్లై 'డ్యూరో లెజెండ్' కార్యక్రమంలో దక్షిణ భారత దేశానికి చెందిన నైపుణ్యం కలిగిన భాగస్వాములను సత్కరించింది. డ్యూరోప్లైకి చెందిన ఈ లెజెండ్ స్కిల్ పార్టనర్‌లలో చాలా మంది తరతరాలుగా కంపెనీతో ఉన్నారు. ప్లైవుడ్, బ్లాక్ బోర్డ్‌లు, డోర్‌ల ప్రీమియం శ్రేణికి డ్యూరోప్లై ఎంతో మన్నన పొందింది. ఇది ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ప్రముఖసంస్థగా ఉంది. దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశంలో కంపెనీ చాలా వేగంగా అభివద్ధి చెందుతోంది. మన్నిక, నాణ్యతకు సంబంధించి డ్యూరోప్లై ఎంతో ఖ్యాతిని సంపాదించింది. ఈ సందర్భంగా డ్యూరోప్లై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అఖిలేష్ చిట్లాంగియా మాట్లాడుతూ ''డ్యూరోప్లై ఒక బ్రాండ్‌గా ప్రీమియం నాణ్యతకు పర్యాయపదంగా మారిందన్నారు. దక్షిణ భారతదేశం అంతటా ఉన్న లెజెండ్‌లు ఒకచోట చేరి తమ విజయరహస్యాలు పంచుకు నే వేదికను అందించడం తమ లక్ష్యమని తెలిపారు. తద్వారా మొత్తం ఆవరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. డ్యూరో లెజెండ్స్ వారి విధేయత, ప్రయత్నాలు, కషికి ప్రతిఫలం పొందారని, లెజెండ్ స్కిల్డ్ భాగస్వాములు కూడా ఈ గుర్తింపు పొందినందుకు తమ సంతప్తిని వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోని ఇళ్లలో డ్యూరోప్లై ప్రీమియం ప్లైవుడ్‌ను విస్తతంగా స్వీకరించే దిశగా తమ ప్రయత్నాలను పునరుద్ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అసంత ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










