Oct 30,2023 01:39
కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సర్వ నేత్రాలయ వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-ఒంగోలు: సర్వ నేత్రాలయ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో స్థానిక రంగారాయుడు చెరువు వాకింగ్‌ ట్రాక్‌పై ఆదివారం ఉదయం డయాబెటిక్‌ రెటినోపతిపై ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మానస పెనుమెచ్చ మాట్లాడుతూ షుగర్‌ పేషంట్లకు వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో హాస్పిటల్‌ సిబ్బంది పాల్గొన్నారు.