Apr 18,2023 00:30

సుబ్బారావును పరామర్శిస్తున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి - సామర్లకోట
సామర్లకోట మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు దవులూరి సుబ్బారావు సోమవారం తన పొలంలోని గట్టుపై నడుచుకుంటూ వెళ్తుండగా పాము సుబ్బారావు కాలికి పాము కాటేసింది. దీంతో సమీపంలోని పలువురు రైతులు సుబ్బారావును సామర్లకోట ప్రభుత్వా సుపత్రికి తరలించగా సామర్లకోట వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం పనసపాడు లోని మెడికల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. సుబ్బా రావుకు ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నియోజక వర్గంలోని వైసిపి నాయకులు ఆసుపత్రికి చేరుకుని సుబ్బారావును పరామర్శించారు.