Apr 22,2023 23:26

దవులూరి సుబ్బారావును పరామర్శిస్తున్న ఎంపి బోస్‌, వైసిపి నాయకులు


ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
ఇటీవల పాము కాటుకు గురై మండలంలోని పనసపాడు మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసిపి రాష్ట్ర కార్మిక నాయకుడు, మున్సిపల్‌ కోప్షన్‌ సభ్యులు దవులూరి సుబ్బారావును శనివారం సాయంత్రం రాజ్యసభ సభులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పరామర్శించారు. సుబ్బారావు తనయుడు ఎపి స్టేట్‌ హౌసింగు కార్పోరేషన్‌ చైర్మన్‌, పెద్దాపురం నియోజకవర్గం వైసిపి ఇన్‌చార్జి దవులూరి దొరబాబుతో కలసి మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దవులూరి సుబ్బారావును పరామర్శించి, యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నారు. అయన వెంట వైసీపీ పంచాయతీ రాజ్‌ విభాగం జిల్లా అద్యక్షులు మోరంపూడి రంగ, వైస్‌ ఎంపిపి పేర్నిడి వెంకట రాయుడు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మినారాయణ, వైసిపి కౌన్సిలర్‌లు నేతల హరిబాబు, పాగా సురేష్‌ కుమార్‌ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు వున్నారు.