Sep 22,2023 00:15

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్‌

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్‌
ప్రజాశక్తి -తిరుపతి సిటీ: తిరుపతి నగరంలోని పలుచోట్ల ద్విచక్ర చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను వద్ద నుంచి 34 మోటార్‌ సైకిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్‌ డిఎస్పి ఏ సురేంద్ర రెడ్డి తెలిపారు. స్థానిక అలిపిరి పొలిటిషన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీలేరు కు చెందిన ఎం వెంకట వేణుగోపాల్‌ నాయక్‌ (33) కుప్పంలోని శ్రీ రామ్‌ ఫైనాన్స్‌ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తూ మూడు సంవత్సరాల క్రితం నిలిచిపోయాడన్నారు. జల్సాలు కలవాడు పడిన అతను ప్రతిరోజు పీలేరు నుంచి తిరుపతికి వచ్చి పలుచోట్ల పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనను చోరీ చేసేవాడని తెలిపారు. అతనిపై నిఘా ఉంచిన అలిపిరి సిఐ అబ్బన్న సూచనల మేరకు ఎస్సై రాజశేఖర్‌ గురువారం ఉదయం జూ పార్క్‌ రోడ్లను సైన్స్‌ సెంటర్‌ వద్ద నిందితున్ని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి వేరే ఆలోచన విలువ చేసే ముప్పై నాలుగు మోటర్‌ సైకిల్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించామన్నారు. నిందితుడు అరెస్టు సొత్తు స్వాధీనంలో సహకరించిన అధికారులు సిబ్బందిని ఆయన అభినందించారు.