Jan 21,2021 06:47

ఈమధ్య కాలంలో...దేశంలో, ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలలో...అనేక చట్టాలు ప్రవేశ పెట్టడం చూస్తున్నాం. వాటిలో ప్రధానంగా గోవధ, వివాహ మరియు మత మార్పిడులను ఆసరాగా చేసుకుని, ముస్లింలను లక్ష్యంగా చేస్తూ దాడులకు పాల్పడడం, బహిరంగ ప్రదేశాలను అందరూ కలిసి వినియోగించు కోవడానికి అనుమతించకపోవడం, పౌరులుగా సమాన హక్కులను తిరస్కరించడం జరుగుతోంది. ఈ విధానం దేశంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రోజువారీ జీవన విధానాన్ని, సౌభ్రాతృత్వాన్ని నాశనం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన 'ఆర్డినెన్స్‌-2020' ఉద్దేశం చట్టబద్ధంగా లేని మత మార్పిడులను నిషేధించడంగా కనిపిస్తోంది. అదే విధంగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'బిల్లు-2020' ప్రత్యేకంగా నాలుగు విధాలుగా విషపూరితమైనవి.


రాజ్యాంగానికి లోబడి ప్రతి పౌరుడు తనకున్న హక్కులను వినియోగించుకోవడానికి, బాధ్యతలు నిర్వర్తించడానికి వీలుంటుంది. ఈ కొత్త చట్టాలు వ్యక్తిగత పౌరులకు బదులుగా, మతపరమైన సమాజాలను, ప్రాథమిక సంస్థలుగా గుర్తిస్తాయి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు వ్యక్తిగతంగా స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించడానికి అనుమతిస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మన రిపబ్లిక్‌ యొక్క చట్రాన్ని ప్రాథమికంగానే వక్రీకరిస్తున్నాయి.


కొందరు, రాజ్యాంగం ప్రధానంగా మైనారిటీలకు, అస్పృశ్యులకు ఇచ్చిన హక్కులను గురించి వాదిస్తూ ఉంటారు. ఇది కేవలం వారు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను, వ్యక్తులుగా తమ హక్కులను అనుభవించటానికి పౌరులుగా వారు, వారి సామర్థ్యానికి దూరం కాకుండా చూడడమే లక్ష్యమని వారు అంగీకరించాల్సి ఉంటుంది. ప్రపంచాన్ని హిందూ ముస్లింల మధ్య విభజనగా చూసినప్పుడు ఆధునిక ప్రపంచంలో వ్యక్తులుగా ప్రతి భారతీయునికి ఇవ్వవలసిన ప్రాథమికమైన స్వయంప్రతిపత్తి అనే హామీకి భంగం కలుగుతుంది. రెండవది, వీరు చేసిన ఈ చట్టాలు, వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రశంసిస్తూ, 2017 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిర్ద్వంద్వంగా ఉల్లంఘించినట్లే. సామాజిక సంబంధాలలో రాజ్యం యొక్క జోక్యం ఇద్దరి వ్యక్తుల మధ్యనున్న సామరస్య పూర్వకమైన సంబంధాన్ని, రాజ్యాంగం యొక్క ప్రాథమిక చట్రాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది.


మూడవది, ఈ నిబంధనల వల్ల, ప్రభుత్వ అనుమతి లేకుండా వ్యక్తులు తమ వ్యక్తిగత విశ్వాసాలను పాటించే హక్కు లేకుండా దూరం చేస్తాయి. ఈ కొత్త చట్టాలకు లోబడి ప్రతి ఒక్కరి నుండి, అనేక రకాలుగా పోలీసుల నుండి, స్థానిక సంస్థల నుండి, మతపరమైన బృందాల నుండి, కుటుంబాల నుండి జోక్యం చేసుకోవడానికి తగిన అవకాశం కల్పించి, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి చోటు లేకుండా చేస్తాయి. వృత్తిని మార్చుకునే విషయంలో గానీ, జాతీయత విషయంలో కానీ, ఎన్నికలకు సంబంధించిన ఎంపికలో, రాజకీయ పార్టీల విషయంలో కూడా ఎలాంటి జోక్యాన్ని అనుమతించరాదు. సుప్రీంకోర్టు 1977లో ఇచ్చిన తీర్పు, మధ్యప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాలలో మత మార్పిడుల విషయంలో గతంలో విధించిన నిబంధనలను సమర్థించింది. ఆ విధంగా తీర్పు ఇవ్వడానికి కారణాన్ని కూడా సుప్రీంకోర్టు వివరించింది. బలవంతంగా మత మార్పిడి చేసినా, మోసం చేసి ఆకర్షించినా, కపటంతో లోబరుచుకున్నా, జరిమానా విధించేందుకు వీలుగా ఆదేశించవలసి వచ్చిందని సుప్రీంకోర్టు వివరించింది. మరొక విషయం ఏమంటే ప్రతి పౌరుడు తనకిష్టమైన వృత్తిని, మతాన్ని ఆచరిస్తూ దాని ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఒత్తిడి ద్వారా గాని, బలవంతంగా గాని లేక మరే విధమైన ఆకర్షణ పద్ధతుల ద్వారా గాని ఇతరుల హక్కులలో జోక్యం చేసుకోవడాన్ని, వారి అభిప్రాయంలో రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 25 (1) ను అతిక్రమించడమే. పై ఆర్టికల్‌ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ప్రచారాన్ని వివాదాస్పదం చేస్తూ 1977లో ఆర్టికల్‌ 25లో ఉన్న 'స్వేచ్ఛ' అనే పదాన్ని వెనక్కి తీసుకుంది. డా|| అంబేద్కర్‌ బౌద్ధమతం లోకి సామూహికంగా మారినందువల్ల జైలు శిక్షకు గురవుతాడనే దృష్టితోనా!? 1977 తీర్పును వెనక్కి తీసుకోవడానికి బదులుగా ఈ చట్టాలు వ్యక్తుల యొక్క విశ్వాసం ప్రకారం ఎన్నుకునే స్వేచ్ఛను మరింత నేరపూరితం చేస్తాయి.


నాలుగవది, కొత్త చట్టానికి ప్రాతిపదిక పూర్తిగా పురుషాధిక్యతతో కూడుకున్నది. మతపరమైన అభిమానాలతో, దురభిమానాలతో 1920 దశకంలో భారతావని ఒక పీడ కలగా మారింది. ప్రమాదకరమైన అవాస్తవిక 'లవ్‌ జిహాద్‌' పేరుతో యుక్తవయసు ఆడపిల్లలను తమ ఆస్తిగా భావిస్తూ, ఇది కేవలం ఒక కరపత్రమో, వాట్సప్‌ సమాచారమో కాదనే విషయం మరిచారు. అది ఇప్పుడు ఒక చట్టంగా మారింది. 2017లో చట్టవిరుద్ధంగా మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్‌ 2020 యొక్క దారుణమైన చీకటి ఫలితాలను ప్రత్యక్షంగా గమనించాం. ఈ చట్టం కేరళకు చెందిన ఆరోగ్య కార్యకర్త 'హదియా' విషయంలో ఎదురైంది. ఒక సంవత్సరం తర్వాత తన వైవాహిక విశ్వాసంతో ''ఇస్లాం'' స్వీకరించినప్పుడు ఈ సమస్యను ఆమె ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ చట్టం ముస్లిం యువకులను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ హిందూ యువతులకు కూడా సజీవ నరకంగా మారింది.


భారతదేశం మంచి లక్ష్యాలను ఎంచుకుని సామాజిక మార్పులను సాధించింది. గణతంత్ర రాజ్యంలో మంచి లక్ష్యాలను సాధించాలన్న ఉద్దేశంతో విలువలతో కూడిన చట్టాలను రూపొందించినందుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. మన రాజ్యాంగం, మనం ఆచరించాలని ఉన్నతమైన లక్ష్యాలను రూపొందించింది. కానీ భారతీయులు ఎన్నడూ ఆ స్థాయిలో జీవించడం లేదు. ఉన్నత లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా ఉంటూ నెమ్మదిగా ముందుకు వెళుతున్నాము. గతం కంటే మెరుగ్గా పురోగమిస్తున్నాము. అన్ని చట్టాలు ఆ లక్ష్యాలను క్లుప్తంగా అయినా అనుకున్నది సాధించాలి. ప్రస్తుతం తెచ్చిన కొత్త చట్టాలు పై లక్ష్యాలకు భిన్నంగా ఉన్నాయి. అవి ప్రభుత్వ అధికారాన్ని, చట్టాలను కూడా మత పక్షపాత ఆధిపత్య భావంతో ఉంచుతాయి. ఇవి తమ పాలనలో వివాహాలు, స్నేహాలు, సాంగత్యాలు, సావాసాల విషయంలో తిరోగమన భావాలను ప్రవేశపెడుతుంది. మతాంతర వివాహాలు 2.5 శాతానికి తక్కువగానే ఉండవచ్చు. కాని వారిచ్చే వాగ్దానాల సంఖ్య అంచనాలకు మించి ఉంటుంది. వారు పౌరులందరూ సమానమనే భావంతో పాటు స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను పునరుద్ఘాటిస్తారు.


'లవ్‌ జిహాద్‌' గురించి మద్దతుదార్ల పుకార్ల్లు ఉన్నప్పటికీ...ప్రభుత్వం అలాంటి పుకార్లకు ఆధారమేమీ లేదని పార్లమెంటులో ధ్రువీకరించింది. అది పూర్తిగా గర్హనీయమైనది. అది అపనమ్మకమనే విత్తనాలను నాటుతోంది, కాబట్టి ప్రమాదకరమైనది. బహుళత్వంతో కూడిన ప్రజాస్వామ్య దేశాలు ఉండవలసిన తీరును, దానికి ఉండవలసిన ప్రాథమికమైన సూత్రాలను మార్పు చేస్తుంది. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని నిలబెట్టాలంటే కోర్టు తనంతట తానుగా ఈ చట్టాలను తిరస్కరించాల్సి ఉంటుంది.


1935 సెప్టెంబర్‌లో హిట్లర్‌ 'న్యూరెంబర్గ్‌ చట్టాల'ను తీసుకొచ్చినప్పుడు...జర్మన్‌, జూయిష్‌ పిల్లల మిశ్రమ సంతతిగా మారి అధోగతి పాలవుతుందనే భయంతో 'స్వచ్ఛత' అనే ఆలోచనతో నాజీలు నిమగమై వున్నారు. జనాభాలో 50 శాతం యూదులు, 50 శాతం ఆర్యన్ల వల్ల నాజీ ఆలోచనలకు ప్రమాదకరమని, నాజీలు భావించారు. అటువంటి వైవాహిక, లైంగిక సంబంధాలను నిరోధించడమనే ఆలోచనలకు మోసపూరితమైన ''నరవంశ శుద్ధి'' అనే సామాజిక రాజకీయ ఆలోచనాతత్వానికి దగ్గర సంబంధం ఉంది. ద్వేషమే చట్టంగా మారితే మన సమాజం, దేశం మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని మరువకూడదు.
                             * సీమా చిస్తీ (వ్యాసకర్త ఢల్లీీ జర్నలిస్ట్‌, 'ద హిందూ' సౌజన్యంతో)