Jul 31,2023 23:56

స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోన


ప్రజాశక్తి-బాపట్ల
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఆహార ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసి డ్వాక్రా సంఘాల సభ్యుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునందించాలని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కోరారు. సోమవారం బాపట్ల పాత బస్టాండు ఆటో స్టాండ్‌ వద్ద స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే అనేక ఉత్పత్తులను నెలలో ఒకరోజు పాత బస్టాండ్‌ సెంటర్లో ఏర్పాటు చేసే స్టాల్స్‌ ద్వారా విక్రయిస్తారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించేందుకు ఈ స్టాల్స్‌ ద్వారా విక్రయించే ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భాను ప్రతాప్‌, మెప్మా నాయక్‌, విశ్వనాథం, అర్బన్‌ స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.