Oct 28,2022 23:39

మహాసభలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మ

ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు ఐ.పద్మ
ప్రజాశక్తి - విఆర్‌.పురం

డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు ఐ.పద్మ డిమాండ్‌ చేశారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం కూనవరం మండల మహాసభ బొజ్జ సుధారాణి, కారం జయసుధ, బోగ్గా సుధారాణి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ మహిళలు పొదుపు డబ్బులు బ్యాంకులో దాచుకుంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చుపెడుతూ మహిళలకు పెద్ద పీట వేస్తామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. మహిళలు ఇన్సూరెన్స్‌ రూపేణ కట్టిన అభయ హస్తం డబ్బులు ప్రభుత్వం తక్షణమే మహిళలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో సంఘంలో తీసుకున్న అప్పులు కరోనా వల్ల రెండేళ్లు, వరదలు వల్ల ఈ ఏడాది నష్టపోయారని, అందువల్ల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయికులు ఎం.రంగమ్మ, ఎం.గిరిజా, మండల నాయుకులు కుంజ రాధా, పాయం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.