ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం
డ్వాకా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో 11 మండలాలకు చెందిన వెలుగు ఎపీఎంలు, డిపిఎంలు, ఎపిడితో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సభ్యులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. అన్ని మండలాల్లోని మహిళా సంఘాలు ఇప్పటివరకు రూ.10 లక్షలు రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. రుణాలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో గ్రేడ్లుగా విభజించి నివేదికల సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలోని అన్ని మండలాల్లో స్త్రీ నిధి పథకం అమలు తీరుపై ఆరా తీశారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు సకాలంలో రికవరీ చేయించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ప్రతి రుణానికి బ్యాంకు లింక్ తప్పనిసరి చేయించాలన్నారు. ఈ సంవత్సరం చింతపండు, పసుపు ప్రాసెసింగ్‌పై ఆయన ఆరా తీశారు. ఏజెన్సీలోని మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఎంతమంది పొంది ఉన్నారో తెలుసుకున్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఒక్కొక్క మండలంలో ఎన్ని యూనిట్లు మంజూరు చేసింది మార్కెటింగ్ ఏ విధంగా జరుగుతుందో ఆరా తీశారు. వెదురుతో తయారు చేసే ప్రొడక్టలు ఈ విధంగా మార్కెటింగ్ చేస్తుందో ఆరా తీశారు. ప్రతి మండలంలోనూ మహిళా సంఘాల సభ్యులు కొనుగోలు చేసిన ఉత్పత్తులను భద్రపరిచే విధంగా ముందుగా గొడౌన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపిడి ఎ.శ్రీనివాసరావు. డిపిఎంలు పరమేశ్వరరావు, అపర్ణ, పూర్ణచంద్రరావు, యాంకర్ పర్సన్ రామరాజు, ఏపిఎంలు దుర్గాప్రసాద్, మధు, అప్పారావు, జేమ్స్ రాజు, శ్యాం కుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.










