Nov 05,2023 20:27

డ్వాక్రా బజార్‌లో సామగ్రి కొనుగోలు చేస్తున్న నగర ప్రజలు

ప్రజాశక్తి-విజయనగరంకోట : విశేష ప్రజాదరణ పొందుతున్న అఖిల భారత డ్వాక్రా బజార్‌ మరో మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సరస్‌లో అమ్మకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే విక్రయాలు రూ.3 కోట్లు దాటాయి. వివిధ రకాల అలంకార వస్తువులు, హస్తకళలు, వస్త్రాలు, దుస్తులు, తినుబండారాలతో ఈ ప్రదర్శన అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉంది. 15 రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు సుమారు 45 స్టాల్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా ఆహ్లాదాన్ని కలిగించేందుకు, మన సంస్కృతి, సంప్రదాయాలను అందరికీ చాటి చెప్పేందుకు ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎ.కళ్యాణ్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ముందు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 8వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని కళ్యాణ చక్రవర్తి తెలిపారు.