పరిశీలిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -పొదలకూరు : ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ పథకం ప్రకారం కథనాలు అల్లి దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కండలేరు ఎడమ గట్టు కాలువపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ఆయన మీడియా, రైతుల సమక్షంలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కరెంట్ బిల్లులు చెల్లించక పోవడం వల్ల కరెంటు కట్ చేశారంటూ, అందువల్ల చుట్టుపక్క రైతులకు సంబంధించిన పంటలు ఎండిపోయాయని సోమిరెడ్డి దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు.ఉద్యానవన శాఖ అధికారులు మండల స్థాయి అధికారులు ఉన్నారు.










