May 18,2023 00:01

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మార్చిలో జరిగిన దూరవిద్య డిగ్రీ ఫలితాలను విసి పి.రాజశేఖర్‌ బుధవారం విడుదల చేశారు. బిఎ, బీకాం, బిఎస్‌సి, బిహెచ్‌ఎం, బిబిఎ, బిబిఎం ఫలితాలను దూరవిద్య వెబ్‌సైట్‌ నుండి పొందవచ్చన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 29వ తేదీ లోపు ఒక్కో పేపర్‌కు రూ.770 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.