ప్రజాశక్తి-వీరఘట్టం : మండలంలోని విక్రమపురం జంక్షన్ నుండి కంబరవలస మీదుగా కంబర వరకు రోడ్డు పనులను ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్యే విక్రాంత్ ఉద్దేశ పూర్వకంగా నిలిపేశారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని యు.వెంకంపేట గ్రామ రహదారిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో ఆ రహదారి మరమ్మతులు చేపట్టేందుకు రూ.36 లక్షలు మంజూరైతే, పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడం ఆగిపోయాయని తెలిపారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కావాలని ఆ రోడ్డు పనులు ఆపేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు యు.ఉదయభాస్కర్, ఎఎంసి మాజీ చైర్మన్ పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, మాచర్ల నందిశ్వరరావు, బల్ల హరిబాబు, మాచర్ల అనిల్, శ్రీనివాసరావు, భాస్కరరావు, పి.తిరుపతి, వంగపండు పకీర్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.










