ప్రజాశక్తి - వన్‌టౌన్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించు కునేందుకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (ఏపిసిసి) నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావులు ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా అహ్వానించి అమ్మవారి దర్శనం చేయించారు. తదనంతరం వేద పండితులు దీవెనలతో అమ్మవారి ఆశీర్వచనాలు అందుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి అమ్మవారి ప్రసాదం అందజేశారు.










