ప్రజాశక్తి - వన్‌టౌన్ : దుర్గమ్మను శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్‌అండ్‌డి మరియు చైర్మన్ డిఆర్‌డిఓ డా. జి. సతీష్ రెడ్డి, అలాగే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తి వి. సుజాత కుటుంబ సభ్యులతో దుర్గమ్మను దర్శించు కోవటానికి శనివారం ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఇఓ భ్రమరాంబ, చైర్మన్ కర్నాటి రాంబాబు, పాలకమండలి సభ్యులు పాల్గొని అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వారికి వేదపండితులు వేద ఆశీర్వచనం చేసి, ప్రసాదం అంజేశారు.
దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఊరేగింపు :శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవాలయం ఆధ్వర్యంలో చైత్రమాస బ్రహ్మాోత్సవములలో భాగంగా శనివారం మొదటి రోజున సాయంత్రం మంగళ వాయిద్య ముల నడుమ వెండి పల్లకీపై శ్రీ గంగా దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్టుబోర్డ్ సభ్యులు కట్టా సత్తయ్య, బుద్దా రాంబాబు, బచ్చు మాధవీ కష్ణ, కేసరి నాగమణి, వైదిక సిబ్బంది, అర్చక సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










