Dec 16,2022 23:06

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనార్థం రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్‌ శుక్రవారం విచ్చేశారు. శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన మంత్రి ఉషశ్రీ చరణ్‌కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు