ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను రాష్ట్ర పౌరసరఫరాలు, విని యోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దంపతులు బుధవారం శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయానికి విచ్చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనము కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.
దుర్గమ్మ ఆలయానికి ఎస్‌విబిసి టిటిడి అడ్వైజర్ దుర్గారావు :
దుర్గమ్మ దర్శనార్థం ఎస్‌విబిసి టిటిడి అడ్వైజర్ దుర్గారావు శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. అనంతరం వీరు ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబుని కలిసి ఆలయం నందు నిర్వహించు సాంస్కతిక కార్యక్రమముల గురించి చర్చించారు.










