ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనార్థం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దంపతులు శుక్రవారం శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దరర్శనార్థం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆలయానికి విచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో కె.ఎస్. జవహర్‌రెడ్డికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహ ణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్ర్రం, చిత్రపటం అందజేశారు.










