ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానానికి రాష్ట్ర బి.సి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ దంపతులు అమ్మవారి దర్శనార్థం గురువారం ఆలయానికి విచ్చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.










