
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : దసరా సందర్భంగా నగరంలోని వివిధ చోట్ల ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రి మండపాలను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి ఉత్సవ మండపానికి చేరుకున్నారు. ఆ తర్వాత బాబా మెట్టలో దేవి పార్కులో వేంచేసియున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం అశోక్ నగర్, బింగివీధి తదితర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన దసరా ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఐదో డివిజన్ కార్పొరేటర్ గాదం మురళి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బాబా మెట్ట దేవి పార్కులో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నమన్నారు. 2 ఏళ్ల క్రితం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సహకారంతో శాశ్వత మండల నిర్మాణాన్ని ఏర్పాటు చేసామన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కేఏపీ రాజు తదితరులు పాల్గొన్నారు.
పైడితల్లమ్మ ఆలయంలో కోలగట్ల పూజలు
నగరంలోని అంబటి సత్రం జంక్షన్ వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన రాకను పురస్కరించుకుని పైడిమాంబ సేవా కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మధుసూదన రావు, కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవాన్ని పురస్కరించుకుని తమ ప్రాంతం అంబటి సత్రంలో కొలువైయున్న పైడిమాంబ చల్లధనం కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. పైడితల్లమ్మ జాతర సందర్భంలో నల్ల మారమ్మ, పైడితల్లమ్మ వంటి గ్రామదేవతలను గద్ది దగ్గరకు తెచ్చి పూజలు చేసి కొలువు తీర్చుతున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, వైసిపి నాయకులు వెంపడాపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.