
ప్రజాశక్తి - వన్‌టౌన్ (విజయవాడ): బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. తొలుత ఆలయ ఈవో భ్రమరాంబ, ఆయన పండితులు శివప్రసాద్ శర్మ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అంతరాలయం నుంచి దుర్గమ్మను దర్శించుకున్న నడ్డాకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.