Dec 31,2022 23:04

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ 

ఇంద్రకీలాద్రిపై వున్న శ్రీకనకదుర్గమ్మ వారిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఇఓ దర్భముళ్ళ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.