ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.










