Feb 14,2023 23:43

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను కేంద్ర సాంస్కతిక, పర్యాటక మంత్రి జి.కిషన్‌ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. కేంద్ర మంత్రితో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఉన్నారు. అలాగే రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, శాసనమండలి సభ్యులు రఘురాజు, పివివి సూర్యనారాయణ రాజు, శాసనసభ్యులు బి.అప్పలనరసయ్య, గొర్ల కిరణ్‌కుమార్‌, కర్ణాటక రాష్ట్ర మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, చిన్నస్థాయి పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.నాగరాజు అమ్మవారిని దర్శించుకున్నారు.
అన్నదాన ఏర్పాట్లు పరిశీలన
దుర్గగుడిలో జరిగే నిత్యాన్నదానం ఏర్పాట్లను మంగళవారం ఆలయ చైర్మన్‌ కర్నాటి రాంబాబు, పాలకమండలి సభ్యులు పరిశీలించారు. యాత్రికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మహామండపం మూడో అంతస్తు వద్ద అన్నదానం క్యూలైన్లను, రెండో అంతస్తు వద్ద జరుగుతున్న అన్నదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కట్టా సత్తయ్య, బచ్చు మాధవీ కష్ణ, సహాయ కార్యనిర్వాహణాధికారి పి.చంద్రశేఖర్‌, పర్యవేక్షకులు లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.