ప్రజాశక్తి - వన్‌టౌన్
దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి మహామండపం ఆరవ అంతస్తులో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. నగదు: రూ.1,83, 28,500, బంగారం: 132 గ్రాములు, వెండి: 12 కేజీల 820 గ్రాములు కానుకల రూపంలో భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.. ఆన్‌లైన్ నందు ఈ- హుండీ ద్వారా రూ.8, 078లు విరాళాంగా భక్తులు చెల్లించు కొన్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి. దర్భముళ్ల భ్రమ రాంబ, తెలిపారు. 29వ తేదీ కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.










