ప్రజాశక్తి - వన్‌టౌన్ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవ స్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకునేందుకు శనివారం సెలవు కావటంతో భక్త జనం అదిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ అమ్మవారి దర్శనార్ధం విచ్చేయు భక్తుల రద్దీ దష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లును ఆలయ కార్యనిర్వ హణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ క్యూ లైన్లను, అంతరాలయ ప్రాంతంలో పరిశీలన చేశారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్షకుంకు మార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీ హాోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవలయందు భక్తులు విశే షంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.










