ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రికి ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారి దర్శనార్ధం భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ దష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఏర్పాట్లును పర్యవేక్షించారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్షకుంకుమార్చన, శ్రీ చక్రనవావరణార్చన, చండీ హాోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొని, శ్రీ అమ్మవారిని స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.










