ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా క్యూ లైనులో భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం అందులోనూ కార్తీక మాసం కావటంతో శ్రీ అమ్మవారి దర్శనార్ధం భక్తులు విశేషంగా విచ్చేసి, శ్రీ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్షకుంకుమార్చన, శ్రీచక్రన వావరణార్చన, చండీ హాోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొని, శ్రీ అమ్మవారిని స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.










