ప్రజాశక్తి-వన్‌టౌన్: ఇంద్రకీలాద్రి మహామండపం ఏడో అంతస్తు ధర్మపదం వేదిక వద్ద శుక్రవారం శ్రీ రాముల వారి పట్టాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బుద్ధా రాంబాబు, బచ్చు మాధవీ కష్ణ పాల్గొన్నారు. దుర్గమ్మను టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాలరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) తరుఫున ఎమ్మెల్సీ రామగోపాలరెడ్డి, ఆయన బందానికి విజయవాడ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ లింగమనేని శివరామ ప్రసాద్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్, జిల్లా టిడిపి వాణిజ్య విభాగ అధ్యక్షులు రాజు సోలంకి, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అద్యక్షులు ఆర్. మాధవ తదితరులు స్వాగతం పలికారు. అలాగే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ దంపతులు దుర్గమ్మను దర్శించుకున్నారు.










