Nov 11,2022 23:01

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ 

దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం కావటంతో శ్రీ అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు క్యూ లైను ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రనవావరణార్చన, చండీ హాోమం, శాంతికళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొని, శ్రీ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.