- నేడు మధ్యాహ్నం 12 గంటలకు సర్వదర్శనం
ప్రజాశక్తి - వన్‌టౌన్ (విజయవాడ) : పాక్షిక సూర్య గ్రహణం సందర్భంగా దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ఆగమశాస్త్ర ప్రకారం మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని మూసివేశారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరుల స్వామి ప్రధానాలయం, ఇతర ఉపాలయాలను ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ సమక్షంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు మూసివేశారు. మళ్లీ బుధవారం ఉదయం 6 గంటలకు వీటిని శుద్ధిచేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించిన అనంతరం తెరుస్తారు. అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి 'సర్వదర్శనం' కల్పిస్తామని ఆలయ ఇఒ భ్రమరాంబ తెలిపారు. ఈ సందర్బంగా దేవస్థానంలో ప్రతిరోజూ జరిగే నిత్యాన్నదానం కూడా నిలిపివేశారు.










