Jun 26,2023 23:00

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: దుర్గగుడి మహామండపం ఆరవ అంతస్తులో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 20 రోజుల్లో యాత్రికులు హుండీల ద్వారా రూ.3,54,87,284 సమర్పించారు. బంగారం 666 గ్రాములు, వెండి 7.752 కిలోలు, ఈహుండీల ద్వారా రూ.36,153 యాత్రికులు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు చింకా శ్రీనివాసులు, బచ్చు మాధవీ కష్ణ, దేవాదాయ శాఖ అధికారులు అనూరాధ, కె.సూపద్నా దేవి పర్యవేక్షించారు. ఆషాడ మాసం సంధర్భంగా అమ్మవారికి పవిత్ర సారెను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత సోమవారం సమర్పించారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.