Mar 13,2023 22:49

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: దుర్గగుడి మహామండపంలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 18 రోజులకు హుండీల ద్వారా నగదు రూ.2,85,32,061, బంగారం 618 గ్రాములు, వెండి 5.430 కిలోలు, ఆన్‌లైన్‌ ఈ-హుండీ ద్వారా రూ.66,159 వచ్చినట్లు ఆలయ పాలకమండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ తెలిపారు. పాలకమండలి సభ్యులు బుద్దా రాంబాబు, కేసరి నాగమణి, కట్టా సత్తయ్య, దేవిశెట్టి బాలకష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవికష్ణ, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, కొలుకులూరి రామసీత, అల్లూరి కష్ణవేణి, తోట్టడి వేదకుమారి లెక్కింపును పర్యవేక్షించారు.
అభివృద్ది పనులపై సమావేశం
దుర్గగుడి పాలకమండలి ఏర్పాటు జరిగి నెల రోజులు గడిచిన సందర్బంగా సోమవారం ఆలయ ట్రస్ట్‌ బోర్డు కార్యాలయంలో ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు మరియు ట్రస్ట్‌ బోర్డు సభ్యులు కేసరి నాగమణి, కట్టా సత్తయ్య, బుద్ధ రాంబాబు, దేవిశెట్టి బాలకష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవి కష్ణ, నంబూరి రవి, చింకా శ్రీనివాస్‌, కొలుకులూరి రామ సీత, అల్లూరి కష్ణవేణి, తొట్టడి వేదకుమారి సమావేశమాయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆలయంలో చేపట్టాల్సిన అభివద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ట్రస్ట్‌ బోర్డు సమావేశం నందు చర్చించి ఆమోదించిన అంశాలపై చర్చిస్తూ, ఇక నుండి ప్రతి నెల ఈ విధంగానే సమావేశం నిర్వహించి ప్రతి అంశంపై క్షుణ్ణంగా చర్చించి ఆలయ అభివద్ధికి పాటుపడాలని నిర్ణయించినట్లు చైర్మన్‌ కర్నాటి రాంబాబు తెలిపారు.