ప్రజాశక్తి-వన్‌టౌన్
దుర్గగుడి దేవస్థానం మహామండపం ఆరవ అంతస్తులో గత మూడు రోజులుగా హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపధ్యంలో మూడవ రోజు గురువారం కూడా హుండీల లెక్కింపు జరిగింది. 14 రోజులకు సంబంధించి నగదు: రూ.4,73, 91,684 లు, బంగారం: 548 గ్రాములు, వెండి: 31 కేజీల 353 గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు. అలాగే ఆన్‌లైన్ ఈ- హుండీ ద్వారా రూ.8,078లు విరాళాంగా భక్తులు సమర్పించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ తెలిపారు.
అన్నదానానికి విరాళం అందజేత
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఆలయం నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానం పధకంనకు భీమనేని వారి వీధి, కొత్తపేట, విజయవాడకు చెందిన తెలనకుల అనంత వెంకట నరసింహం మరియు కుటుంబ సభ్యులు రూ.1,01, 111లు గురువారం ఆలయ కార్యనిర్వాహ ణాధికారి దర్భముళ్ల భ్రమరాంబని కలిసి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. దాత కుటుంబానికి ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు










