ప్రజాశక్తి-వన్‌టౌన్: దుర్గగుడి మహామండపంలోని ఏడో అంతస్తులో ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు కార్యాలయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆలయ సంబంధిత ఫైల్స్‌లో రాంబాబు సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎపి ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పి.గౌతమ్‌రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ బండి పుణ్యశీల, ఉప మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజ, ఇఒ దర్భముళ్ల భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.










