Apr 06,2023 23:02

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: దుర్గమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం (ఘాట్‌ రోడ్‌ ఎంట్రన్స్‌ వద్ద) వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు గిరిప్రదక్షిణ ప్రారంభించారు. గిరిప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, విద్యాధరపురంలోని కుమ్మరిపాలెం సెంటర్‌, నాలుగు స్థంబాల సెంటర్‌, సితార, కబేళా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్‌, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్‌, బ్రాహ్మణ వీధి, ఘాట్‌ రోడ్‌ మీదుగా ఆలయానికి చేరుకున్నారు. గిరిప్రదక్షిణలో మహిళల కోలాట నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు, బచ్చు మాధవీ కష్ణ చింకా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల కష్ణారావు దంపతులు గురువారం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.
నేడు నదీ విహారం
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నదీ విహారం కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబ, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ తెలిపారు. అమ్మవారి చైత్రమాస బ్రహ్మాోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు.