ప్రజాశక్తి - భట్టిప్రోలు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూర విద్యా విధానం ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుకునే వారికి 2023 - 24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఎంఈఓ దేవరాజు తెలిపారు. వెల్లటూరు రాఘవ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధించి పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. బడిమానేసిన విద్యార్థులకు దూర విద్యా విధానం ఎంత ఉపయోగమన్నారు. 14ఏళ్లు నిండిన వాళ్లు 10వ తరగతి చదవటానికి అర్హులని తెలిపారు. మద్యలో చదువు మానేసినవాళ్లు, 10వ తరగతి తప్పి ఇంటి వద్ద ఉన్న వాళ్లు దూర విద్యా విధానం ఉపయోగించుకోవాలని అన్నారు. ఐదు సబ్జెక్టుల ద్వారా కోర్సులు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు, వివిధ సంఘాలు సామాజిక ఆర్థిక, వెనుకబడిన వారికి మేలు జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఫీజులో రాయితీ లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాఘవ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అవర్ శ్రీనివాసరావు, సిఆర్పిలు ఉన్నారు.










