Oct 31,2023 20:46

దుప్పట్లు పంపిణీ చేస్తున్న నిర్వాహుకులు

విజయనగరం: రైలు ప్రమాదంలో గాయపడి, జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు గురజాడ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్‌ ఆర్‌ఎంఒ సురేష్‌ బాబు పాల్గొని, సామాజిక బాధ్యతతో సహాయాన్ని అందింఛిన విజ్ఞాన కేంద్రం నిర్వాకులను అభినందింఛారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ శ్రీనివాసరావు, కార్యదర్శి సతీష్‌, ఉపాధ్యాయులు ఈశ్వరరావు, తిరుపతి నాయుడు, కాలేజీ విద్యార్ధులు పాల్గొన్నారు.
భోగాపురం: రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని జనసేన సమన్వయ కమిటీ కో ఆర్డినేటర్‌ లోకం మాధవి అన్నారు. రైలు ప్రమాద బాధితులను ఆమె విజయనగరం ఆసుపత్రిలో మంగళవారం పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే వారికి అందించాల్సిన సౌకర్యాలను సక్రమంగా అందించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా బాధితు లకు దుప్పట్లు, పండ్లుతో పాటు వివిధ రకాల వస్తువులను ఆమె పంపిణీ చేశారు.