Aug 24,2023 20:56

సిఐకి ఫిర్యాదు చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరులో భక్త కనకదాసు చిత్రపటాన్ని ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని మదాసి, మదారి కరువ సంఘం నాయకులు కోరారు. గురువారం తాలూకా సంఘం ఆధ్వర్యంలో సిఐ వెంకటేశ్వర్లుకు, ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. సంఘం పరిరక్షణ సమితి మాజీ గౌరవాధ్యక్షులు మోహన్‌ ప్రసాద్‌ మాట్లాడారు. ఎల్లార్తి రోడ్డులో ఎఎస్‌ బ్రిక్స్‌ దగ్గర భక్త కనకదాసు చిత్రపటం గీసి ఉన్న బండను అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పగులగొట్టారని తెలిపారు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మదాసి, మదారి కురువ సంఘం నాయకులు ఎస్‌కె.గిరి, తిప్పేష్‌, మరిమల్ల, మంజునాథ్‌ గౌడ్‌, మఠం మహేష్‌, రాజు, చంద్ర, లింగ మూర్తి, రవి, నరాగల్ల రమేష్‌, ఉలేతప్ప, కివాడ రాజా, రామన్న పాల్గొన్నారు.