
ప్రజాశక్తి - నగరం
మండలంలోని ధూళిపుడి నార్త్ గ్రామంలో రైతు భరోసా కేంద్రం సందర్శించి పోలంబడి నిర్వహించారు. వ్యవసాయ అధికారి వేమూరి రమేష్ బాబు వరి పంటను పరిశీలించారు. ప్రస్తుతం వరి పంటలో ఆకు చుట్టు పురుగును గమనించారు. దీని నివారణకు క్లోరిపైరిపాస్ 300ఎంఎల్ 1ఎకరానికి, ఏసిపెట్ 300గ్రాములు 1ఎకరానికి 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అందించే పదకాలు అర్హులైన రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా రైతులకు రైతుభరోసా కేంద్రంలో అందుబాటులో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలని, పంట నమోదు చేసుకున్న రైతుకు ఇకెవైసి ఖచ్చితంగా చేసుకోవాలని తెలిపారు. రైతులు పంట నమోదు చేసుకోవాలని సూచించారు. పంటనష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్, పంట అమ్ముకోవడానికి, సున్నవడ్డి పంట రుణాలకు ఉపయోగ పడుతుందని తెలిపారు. పిఎం కిసాన్ పథకంకి అర్హులైన రైతులు, నగదు జమ అవుతున్న రైతులు మీసేవ, సిఎఫ్‌సి సెంటర్లలో పొలం పాస్ బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలు, ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఇకెవైసి తప్పనిసరి సరిగా చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచి కె హేమామృతం, ఎఇఒ కె నాగ శ్రీనివాసరావు, గ్రామ వ్యవసాయ సహాయకుడు కె నాగవీరవరప్రసాద్ పాల్గొన్నారు.