ప్రజాశక్తి - నగరం
మండలంలోని ధూళిపుడిలో రైతు భరోసా కేంద్రము సందర్శించి పోలంబడి కార్యక్రమము నిర్వహించారు ఎఒ వేమూరి రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి వరి పంటను పరిశీలించారు. ఆకు చుట్టు పురుగు గమనించారు. నివారణకు క్లోరిపైరిపాస్ 300ఎంఎల్ 1ఎకరానికి లేక ఏసిపెట్ 300గ్రాములు 1ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలని రైతులకు సూచించారు. ఈ నెల 25లోపు ఆర్‌బికెలో పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి కె హేమామృతం, ఎఇఒ కె నాగ శ్రీనివాసరావు, గ్రామ వ్యవసాయ సహాయకుడు కె నాగవీరవరప్రసాద్ పాల్గొన్నారు.










