ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
మండలంలోని వేగవరంలో ఓ దుకాణంలోకి ట్యాంకర్ లారీ దూసుకెళ్లింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్ లారీ అదుపుతప్పి రహదారి పక్కన వ్యాపార దుకాణంలోకి దూసుకుపోయిందని స్థానికుల తెలిపారు. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దుకాణంతో పాటు ఫ్రిజ్‌లు, సామగ్రి ధ్వంసమైంది.










