Jul 11,2023 22:17

వేలంలో పాల్గొన్న వ్యాపారులు

ప్రజాశక్తి -పొదలకూరు :దుకాణాలు బహిరంగ వేలంపొదలకూరు పట్టణంలోని నిమ్మ మార్కెట్‌ యార్డ్‌ ఆవరణంలోని 24 దుకాణాలకు మం గళవారం మార్కెటింగ్‌ కమిటీ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌, ఆక్షన్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరావు, సర్లేపల్లి మార్కెటింగ్‌ కమిటీ చైర్పర్సన్‌ పెద్దమల్లు రత్నమ్మ, మార్కెటింగ్‌ కమిటీ ఏడీ సుజాత, సెక్రటరీ నవీన్‌ ఎన్నో మార్లు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ బహిరంగ వేలం సమయంలో స్థానిక గ్రేడ్‌ లైసెన్స్‌ వ్యా పారులు, ఇతరులు, రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ వేలంకు సంబంధించి గ్రేడ్‌ లైసెన్స్‌ వ్యాపారులు, ఇతరులకు పూర్తి సమాచారం ఇవ్వలేదని, అన్ని దుకాణాలకు కలిపి రూ 25 వేలతో ఒక డీడీ తీస్తే ఏ దుకాణాన్ని అయినా పాడుకోవచ్చని ముందు చెప్పి, తర్వాత ఏ నెంబరు ద కాణం కోసమైతే డీడీ కట్టారో ఆ దుకాణాన్ని వేలం పాటలో పాడుకునేందుకు అర్హులని చెప్పడంతో సా ఒక నిమ్మ వ్యాపారులు రీజనల్‌ ఏడీ, సెక్రటరీలతో వాగ్వాదానానికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇటీవల గ్రేడ్‌ లైసెన్స్‌ పొంది నిమ్మకాయల వ్యాపారం చేయనటువంటి వ్యక్తులను కొందరు అతి తక్కువ మొత్తానికి పథకం ప్రకారం దుకాణాలను పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ మొత్తానికి ఎటువంటి పోటీ లేకుండా పొందిన వారిలో అధికార పార్టీకి చెందిన వారే ఉండడం గమనార్హం.