చేతుల్ని కదుపుతూ
రంగుల పోగుల్ని కలుపుతూ
చలాకీగా చీర నేసిన చేయి
ఒక్కసారిగా
నిర్జీవంతో నిరాదరణకు చేరువైంది
ఒకప్పుడు పనుల్ని కల్పిస్తూ
మెతుకుల్ని అందించిన మగ్గం
నమ్ముకొన్న నేస్తం
ఆకలి కేకల్ని చూస్తూ
ఆవేదనా గీతం నేస్తోంది
ఆశల మగ్గం
నిరాశల మృగ్యమై
నట్టేట ముంచి
ఆకలి పేగులకు
ఆగర్భ శత్రువైంది
ఆదుకోవాల్సిన
పాలకుల చేతులు
దూరమై, నిరాశ చీకట్లు అలుముకొన్నాయి
కన్న కలలు కన్నీటి చిత్రమై
బతుకు దుర్భరమై
ఆకలి కేకల నడుమ
నేతన్న గూడు
దుఃఖపు పోగుల నిలయమైంది...!!
మహబూబ్ బాషా చిల్లెం
9502000415