ప్రజాశక్తి -నక్కపల్లి :టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధనకు విద్యాశాఖ ప్రత్యేక కార్యచరణ అమలు చేసింది. దీంతో ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదును ఇస్తున్నారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతుల ద్వారా శిక్షణ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉపాధ్యాయులు చూపిస్తున్నారు. పిల్లల చదువు విషయంలో తీసు కోవలసిన జాగ్రత్తలపై ప్రతి స్కూల్లోనూ తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
మండలంలోని వేంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ నెల నుండి 100 రోజులు ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు, ఫిబ్రవరి నెలలో 50 రోజుల సంసిద్ధత ప్రణాళిక లో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు కోడి శ్రీనివాసరావు అందించిన వివరాలు..పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 5.30 వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. వారంలో ఒకరోజు విద్యార్థులకు పరీక్ష పెట్టి వారిలో సామర్థ్యాన్ని గుర్తిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో 2 రెండు దపాలు సన్నదత పరీక్షలు, మార్చి నెలలో హౌమ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షా ఫలితాలు ఆధారంగా, చదువులో వెనకబడిన విద్యార్థులను సి, డి గ్రేడ్ లుగా విభజించి ఒక్కొక్క ఉపాధ్యాయుడు 5 గురు విద్యార్థుల చొప్పున దత్తత తీసుకుని, ప్రత్యేక శిక్షణ ఇచ్చి మినిమం పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి చర్యలు తీసుకుం టున్నారు. విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆత్మస్థైర్యం పెంపొందేలా ప్రత్యేక కార్యాచరణ ద్వారా తర్ఫీదును ఇవ్వడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు కోడి శ్రీనివాసరావు తెలిపారు.










